ఘనంగా బతుకమ్మ–దేవీ నవరాత్రి ఉత్సవాలు

19-10-2026 | 11:33pm

బాన్వి ప్రహర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా లక్కీ డ్రా

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం రామచంద్రుపేట గ్రామంలో నిర్వహిస్తున్న బతుకమ్మ(Bathukamma), దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాన్వి ప్రహర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన సతీమణి కోరం లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా–సురేందర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో ఆనందోత్సాహాలు నింపేలా మెగా లక్కీ డ్రా నిర్వహించిన ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు పండుగల వైభవాన్ని పెంచడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఖాదర్ బాబు, కొత్తగూడెం మార్కెట్ చైర్మన్ లాల్ సింగ్, సర్పంచ్ వాసం సువర్ణ, మండల కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, మధు, సర్దార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు