పంచాయతీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి

02-10-2026 | 12:48pm

దమ్మపేట,(విజయ క్రాంతి): అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 157వ జయంతి(Mahatma Gandhi 157th Birth Anniversary) సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు మహాత్మా గాంధీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ గాంధీజీ జీవితంలో చూపిన సత్యం, అహింసా, శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు మెంబర్లు పానుగంటి లక్ష్మణగౌడ్, గోళ్ల భవాని కృష్ణ, రూపా రాంబాబు, సి హెచ్ ముక్తేశ్వరావు, పిట్టల శ్రీను, గొల్లపల్లి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు