గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడండి

30-09-2026 | 05:01pm

బోథ్. సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి): గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ(Congress Party) పటిష్టత కోసం గ్రామ కమిటీల వారు కృషి చేయాలని సోనాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజుల పోతన్న సూచించారు. అందుకుగాను గ్రామ కమిటీల వారు పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి అన్నారు. సమావేశంలో ఏఎంసి డైరెక్టర్ భోజన్న ధరావత్ రమేష్ స్పోక్స్ పర్సన్ జాదవ్ రామచంద్ర, స్పోర్ట్స్ పర్సన్ అమృత రావు, మండల ఉపాధ్యక్షులు ఎస్కే మహమూద్, ప్రధాన కార్యదర్శిలు జి పవన్ గుడికి రాందాస్ ,బాసెట్టి సుదర్శన్, లాలు రామ్, బీసీ సెల్ అధ్యక్షులు కే శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు