మైసమ్మగుడాలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
22-09-2026 | 11:57pm
మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ పరిధిలో గల మైసమ్మగూడాలో వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్(Former Councilor Saipeta Srinivas) హాజరై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాంగ్ ఆఫ్ వార్స్ యూత్ సభ్యులను అభినందిస్తూ వినాకుడి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో నిర్వహించడం సంతోషకరమని చెప్పారు.