ఘనంగా జవ్వాజీ లక్ష్మీనారాయణ 52వ జయంతి వేడుకలు

02-10-2026 | 11:37am

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దివంగత జవ్వాజీ లక్ష్మీనారాయణ 52వ జయంతి(Jawvaji Lakshminarayana 52nd Jayanti) వేడుకలను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమానికి తుడుందెబ్బ సీనియర్ రాష్ట్ర నాయకుడు ఊకే రవికుమార్ హాజరై జవ్వాజీ లక్ష్మీనారాయణ(Jawvaji Lakshminarayana ) సేవలను స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కులు(Adivasi rights), అస్తిత్వం కోసం ఆయన తన జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

జవ్వాజీ లక్ష్మీనారాయణ ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఊకే రవికుమార్ తెలిపారు. మండలంలోని ఆదివాసీ యువత తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకుని వాటి పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జవ్వాజీ లక్ష్మీనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు