తరచూ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయొద్దు

16-10-2026 | 05:05am

కేర్ హాస్పిటల్స్ వైద్యులు

వెన్నెముక సమస్యలపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్లు

అక్టోబర్ 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా కార్యక్రమం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ప్రయాణాలు.. గుంతల రోడ్లపై కుదుపులు.. ఆఫీసుకు చేరాక అదేప నిగా కంప్యూటర్ల ముందు కూర్చోవడం.. ఇవన్నీ వెన్ను, మెడనొప్పులకు కారణమవుతు న్నాయని కేర్ హాస్పిటల్స్(Care Hospitals) వైద్యులు హెచ్చ రిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు ఎక్కువసేపు ఒకే భంగి మలో కూర్చోవడం, ట్రాఫిక్‌లో తరచూ బ్రేకు లు వేయడం, గతుకుల రోడ్లపై ప్రయాణిం చడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.

అక్టో బరు 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘జీవితాంతం వెన్నెముక ఆరోగ్యం’అనే నినాదంతో వెన్నెముక సంరక్షణపై అవ గాహన కల్పిస్తున్నారు. సరైన భంగిమలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం, వెన్ను, మెడ నొప్పులు ఎక్కువకాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అవసరమని సూచించారు.

బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, న్యూరో ఇంట ర్వెన్షనిస్ట్, ఎండోస్కోపిక్ స్పున్ సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘చాలా మందికి ఆఫీసుకు చేరకముందే వెన్నుపై ఒ త్తిడి మొదలవుతోంది. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, గుంతల రోడ్లపై ప్రయాణిం చడం వల్ల మెడ, వెన్నునొప్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్లపై కుదుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కారణాల వల్ల తప్పనిసరిగా తీవ్రమైన వెన్నెముక వ్యాధులు వస్తాయని చెప్పలేం. ఇప్పటికే సమస్య లున్న వారిలో నొప్పి పెరగవచ్చు. తరచూ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి’ అని సూచించారు.  వెన్నునొప్పిపై కేర్ హాస్పిటల్స్, హైటెక్‌సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వా సివ్ & డిఫార్మిటీ స్పున్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గోప రాజు జాగ్రత్తలు వివరించారు.

మరిన్ని వార్తలు