ఆడపడుచులకు బతుకమ్మ కానుక

16-10-2026 | 11:02pm

సొంత నిధులతో 'చీరలు పంపిణి'

సుమారు 1200 మంది మహిళలకు....

 ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా  

శివంపేట్ అక్టోబర్ 16 (విజయాక్రాంతి ) : బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పురస్కరించుకొని శివ్వంపేట మండల కేంద్రంలో తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా(Former ZPTC member Pabba Mahesh Gupta) తన సొంత నిధులతో సుమారు 1200 మహిళలకు చీరలను పంపిణీ(Distribution of sarees) చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను కానుకగా అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ, పండుగ వేడుకల్లో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్,ఉప సర్పంచ్ ఇసుగారి మల్లేశం, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు, తదితరులు చీరల పంపిణి లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు