అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణ(Ghatkesar town) ప్రజలు శుక్రవారం రాత్రి సద్దుల బతుకమ్మ పండగ(Saddula Bathukamma Festival) సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ లను పెట్టి ఆటపాటలతో అలరించారు. సద్దుల బతు కమ్మ సందర్భంగా గురుకుల్ కళాశాల(Gurukul College) మైదానం వద్ద జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ లైటింగ్, డీజీఏ సౌండ్ సిస్టంలతో పాటు బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లను చేశారు.
మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, హాజరయ్యారు. అతిథులను మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. గ్రామపెద్దలు పాల్గొని ఈబతుకమ్మ సంబరాలను తిలకించారు.
అలాగే పట్టణం లోని పలుచోట్ల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు వేముల మమతా గౌడ్, మేడబోయిన వెంకటేష్, కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ సగ్గు అనిత, జన సమితి జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కడపోల మల్లేష్, కొత్తకొండ వెంకటేష్ , కందకట్ల మాధవరెడ్డి, బొక్క సంజీవరెడ్డి, కేశవపట్నం ఆంజనేయులు, శశిధర్, రాజబోయిన రాంచందర్ యాదవ్, బచ్చు నాగేష్ గుప్తా, ననావత్ సురేష్ నాయక్, జన చైతన్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, అబ్బసాని పొన్నయ్య యాదవ్, గాజుల వీరేందర్ యాదవ్, శివరాత్రి సురేష్, మామిళ్ళ రమేష్, మానుక కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.