బైక్ ను ఢీకొన్న తార్ కారు
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
భూత్పూర్, అక్టోబర్ 16 : రెండు కార్లు ఒక బైక్ ఢీకొని(Hit by a bike) మహిళ మృతి చెందిన సంఘటన భూత్పూర్ పట్టణంలోని అమిస్తాపూర్ గ్రామంలో(Amistapur Village) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ వైపు వేగంగా వెళ్తున్న రెండు తార్ కార్లు అమిస్తాపూర్ గ్రామం నుంచి మహబూబ్ నగర్(Mahabubnagar) కు బైక్ పై వివాహానికి వెళ్తున్నా బైక్ ను వెనుక నుంచి ఢీ కొట్టింది. వెనుక నుంచి వస్తున్న మరో తార్ కారు బైక్ పై ఉన్న వారిపై నుంచి వెళ్లడంతో సహన బేగం (40) అక్కడికక్కడే మృతి చెందిందని ఆమె భర్త సాకీర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి, కూతురు ఆయరా కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.