శ్రీ సరస్వతి దేవి అవతారంలో ఫ్రెండ్స్ యూత్ అమ్మవారు
మహిళలచే మహా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహణ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం(Ambedkar Stadium at Krishnakalani) ఎదురుగా ఫ్రెండ్స్ యూత్(Friends Youth) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు(Sri Kanaka Durga Sharannavaratri Celebrations) శుక్రవారం 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి(Saraswati) దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా పురోహితులు కొదురుపాక కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
సరస్వతి దేవి అవతారం అమ్మవారు దర్శనం ఇవ్వగా చిన్నారులు పెన్నులు, నోట్ బుక్స్ తో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు అక్షరాభ్యాసం చేశారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలచే మహా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.