పార్టీలకు అతీతంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది

16-10-2026 | 11:35pm

మునిగెల రాజు

గోపాల్ రావు పల్లె లో హైమాస్ లైట్ల ప్రారంభం

తంగళ్ళపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలం గోపాల్ రావు పల్లె  గ్రామంలో స్థానిక సర్పంచ్‌లతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగెల రాజు(Munigela Raju) హైమాస్ లైట్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మునిగెల రాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు(Infrastructure development) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన వసతులు అందించేలా అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.

హైమాస్ లైట్ల ఏర్పాటుతో ప్రధాన కూడళ్లలో వెలుతురు అందడంతో పాటు రాత్రివేళ ప్రజలకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామాల అవసరాలను గుర్తించి నిధులను వినియోగిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గుండు ప్రేమ్, సదానందం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కటకం రాజు, మిరాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి, కొండవేని రవి, సునీల్ రెడ్డి, ప్రేమ్, శ్రీధర్, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు