ఐపిడిఏలో విలీన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 10:09pm

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పిఓ రాహుల్ 

భద్రాచలం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ సంస్థానం మహారాష్ట్రలో కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి ఉండేదని, 1947 ఆగస్టు 15న భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చింది కానీ, హైదరాబాద్ సంస్థానంతో పాటు కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం కాలేదని, ఈ సంస్థానాల విలీనం కోసం అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నాలు చేసి సఫలమయ్యారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. 

గురువారం  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారం చూపి, సమాజాన్ని సమానత్వం, న్యాయం అభివృద్ధి దిశగా నడిపించడం ప్రజా పాలన యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

తెలంగాణ ప్రజా పాలన  సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈరోజును జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపు కుంటునమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి సి ఆనంద కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన, ఏవో సున్నం రాంబాబు, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు