శక్తి యాప్‌ను రద్దు చేస్తేనే పరీక్షలు రాస్తాం

17-09-2026 | 10:14pm

పాలిటెక్నిక్ విద్యార్థులు 

పరీక్షలు బహిష్కరిస్తున్నామంటూ ప్రిన్సిపల్ కు వినతి పత్రం అందజేత

​చేగుంట,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ(Polytechnic education system)ను నిర్వీర్యం చేసే శక్తి జీవో  97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు  కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ(Telangana Polytechnic JAC)  పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా విద్యార్థులు తరగతులతో పాటు రేపటి నుండి జరగబోయే మిడ్-2, పరీక్షలను పూర్తిస్థాయిలో బహిష్కరిస్తూ నట్లు ప్లకార్డులతో  కళాశాల ప్రిన్సిపాల్ ను రే వినతి పత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం దుర్మార్గమని . ప్రభుత్వ కళాశాలల స్వయంప్రతిపత్తిని కాపాడాలని, ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, పేద, మధ్య,తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. సమస్య తీవ్రతపై కళాశాల ప్రిన్సిపాల్, సాంకేతిక విద్యా కమిషనర్, కార్యదర్శికి ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి జీవో  97ను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలను తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు