గిరిజనుల రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్ ది

17-09-2026 | 10:05pm

* కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆల 

భూత్పూర్, సెప్టెంబర్ 17: గిరిజనుల రిజర్వేషన్ల(Tribal Reservations)ను ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసిఆర్కే దక్కుతుందని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Alla Venkateswar Reddy) అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పెద్ద తండాలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంపు చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తాండవస్తులతో కలిసి మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లను ఆరు నుండి 10 శాతానికి పెంచి గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేశారని ఆయన కొనియాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాండాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయి అన్నారు. మిషన్ భగీరథ తో శతాబ్దాలుగా మంచినీటి కోసం కోసపడ్డ గిరిజన సోదరీమణుల కష్టాలు తొలగిపోయాయన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి దశాబ్దాల డిమాండ్ ను కెసిఆర్ నెరవేర్చడంతో తాండల రూప రేఖలు మారిపోయాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్న గిరిజనులకు ఇచ్చిన హామీలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు