విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ స్థలం పరిశీలన

17-09-2026 | 10:06pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణం సోఫీనగర్ లో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను స్థలం, విద్యుత్ ఉపకేంద్ర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాపులను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ పరిశీలనలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్(Electricity Department SE Ramesh), డిఈ నాగరాజు, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు