విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి..

17-09-2026 | 10:18pm

*ఐటీడీఏ ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి మరియు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్...

ఉట్నూర్, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి): గిరిజన సంక్షేమ వసతి గృహా(Tribal Welfare Hostel)లలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఐటిడిఏ ఉట్నూరు ప్రాజెక్టు ఉద్యాన అధికారి (PHO) మరియు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం నాడు ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం* లోని మాన్కాపూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు గాదిగూడ మండలంలోని చిత్తగూడ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. వసతి గృహాలలో విద్యార్ధినీ విద్యార్థులకు ప్రభుత్వ ప్రభుత్వం ఆమోదించిన *మెనూ ప్రకారంభోజనాన్ని అందించాలని స్పష్టం చేశారు.

పాఠశాల ఆవరణలోని వంటగదిని, స్టోర్ రూమ్ ని, తరగతి గదులను, వసతి గృహమును పరిశీలించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఆరా తీసి సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించారు. వసతి గృహ ఆవరణలోనే కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన కూరగాయలు పండించి వాటిని ఉపయోగించాలని పేర్కొన్నారు.

కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్, విద్యార్థుల హాజరు పట్టిక, ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు పరిశీలించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చిత్తగూడ వసతి గృహంలో మెనూ పాటించటం లేదు అని, ఉపాధ్యాయులు సమయపాలన పాయించటం లేదు అని, విద్యార్థుల హాజరు సైతం చాలా తక్కువ గా ఉంది అని గమనించి ప్రాజెక్ట్ అధికారికి నివేదిక సమర్పిస్తా అని సందీప్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు