రాయపూడి ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో చీరల పంపిణీ
హాజరైన కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య
కోదాడ అక్టోబర్ 16,(విజయక్రాంతి): దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో(Devi Navaratri festival) భాగంగా సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా రాయపూడి ఆర్యవైశ్య మిత్రమండలి(Rayapudi Arya Vysya Mitra Mandali) ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం పేద మహిళలకు నూతన చీరలను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య లు ముఖ్య అతిథులుగా పాల్గొని చీరల పంపిణీ చేసిన అనంతరం అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. దేవీ శరన్నవరాత్రి వేళ పండుగ వాతావరణంలో నిరుపేదలకు సహాయం చేయడం, అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. తోటివారికి సేవ చేయడంలో రాయపూడి మిత్రమండలి సభ్యులు ముందుండడం అభినందనలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు గరినే కోటేశ్వరరావు, నీలా సత్యనారాయణ, రాయపూడి వెంకటనారాయణ,ఇమ్మడి సతీష్ బాబు,బెలిదే అశోక్, బండారు శ్రీనివాసరావు, బ్రహ్మానందం, పురుషోత్తం, బూరెల కరుణాకర్, జగినీ ప్రసాద్, సైదారావు, వెంపటి వెంకటరమణ, లక్ష్మణ్, చల్లా విజయ శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.