మోతె తహసీల్దార్ కార్యాలయానికి అటెండర్లను కేటాయించాలి
03-10-2026 | 07:23pm
మోతె, అక్టోబర్ 03 (విజయ క్రాంతి):- మోతె తహసీల్దార్ కార్యాలయంలో(Mothe Tahsildar Office) ముగ్గురు అటెండర్లు(Attendants) ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క అటెండర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు తెలిపారు. దీంతో కార్యాలయంలో పనులు సక్రమంగా సాగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న రెండు అటెండర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, మరో ఇద్దరు అటెండర్లను మోతె తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించాలని మండల ప్రజలు కోరారు.