పంచాయతీ కార్యదర్శి సస్పెండ్‌

24-10-2026 | 02:50pm

అక్రమ నిర్మాణాలు, రికార్డుల అవకతవకలపై కలెక్టర్‌ చర్యలు

సిద్దిపేట రూరల్‌: నారాయణరావుపేట గ్రామ పంచాయతీ(Narayanaopet Panchayat) కార్యదర్శి జె. రవికుమార్‌ను జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి(Collector K. Haimavathi) సస్పెండ్‌ చేశారు. గ్రామంలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టడం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, ఇంటి నంబర్లు, పన్ను రసీదులు, నో డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌ 15న సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది.

మరిన్ని వార్తలు