వైనాల కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

24-10-2026 | 03:18pm

సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

కమాన్‌పూర్,(విజయక్రాంతి): కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Kamanpur Agricultural Market Committee) చైర్మన్ వైనాల రాజు, హనుమకొండ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ వైనాల వినోద్ కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ శనివారం పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాంబయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబయ్య మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వైనాల కుటుంబాన్ని వేర్వేరుగా పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ ఎంపీడీవో సాదినేని ప్రియాంక, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుమాల ప్రకాష్ రావు, మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణారెడ్డి, కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు, కాళేశ్వరం డైరెక్టర్ కాటం సత్యం, మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు అవినాష్ గౌడ్, ముస్త్యాల రమేష్, ముస్త్యాల రాజన్న, దున్నపోతుల రాజయ్య, రామగుండం శ్రీనివాస్, పిల్లలమర్రి రమేష్, సుల్తానాబాద్ మాజీ కౌన్సిలర్ రఫీక్, కుమార్, లల్లు, వైనాల బాపు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు