ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్‌ వైశాల్యం పెంచాలి

21-09-2026 | 03:55pm

సీపీఐ గజ్వేల్‌ నాయకుల డిమాండ్‌

గజ్వేల్‌, సెప్టెంబర్‌ 21: గత ఏడాది 900 చదరపు అడుగుల వైశాల్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ప్రస్తుతం 750 చదరపు అడుగుల స్లాబ్‌ నిబంధన విధించడం సరికాదని సీపీఐ నాయకులు(CPI leaders) అన్నారు.  ఈ మేరకు సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మీ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ  ఇప్పటికే రెండు బిల్లులు తీసుకున్న లబ్ధిదారులకు స్లాబ్‌ వైశాల్యం కారణంగా తుది బిల్లు నిలిపివేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన జీవోను పునఃసమీక్షించి, నిర్మాణం ప్రారంభించిన పాత లబ్ధిదారులకు పాత నిబంధనలే వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పట్టుదయానంద రెడ్డి, శివలింగ కృష్ణ, టి. నరసింహారెడ్డి, స్వర్గం రాజేశం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు