మార్కెట్లకు లాభాల క్లోజింగ్.. సెన్సెక్స్, నిఫ్టీ పైపైకి
21-09-2026 | 04:10pm
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆరు వారాలుగా కొనసాగిన నష్టాల తర్వాత మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు పుంజుకున్నాయి. ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్లు లాభపడి 74,894.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.90 పాయింట్లు పెరిగి 23,414.30 వద్ద స్థిరపడింది. ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.
అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అధిక ముడిచమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుండటంతో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి