సెయింట్ మేరీస్ పాఠశాలలో గణేష్ నిమజ్జనం
21-09-2026 | 04:01pm
విద్యార్థుల్లో మంచి గుణాలు పెంపొందాలని ఆకాంక్ష
గజ్వేల్, సెప్టెంబర్ 21: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో (St. Mary's Vidyaniketan High School)సోమవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం ముగింపు కాదని, గణపతి నుంచి నేర్చుకున్న మంచి గుణాలను జీవితంలో ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు జ్ఞానం, వివేకం, ధైర్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ కలగాలని ఆకాంక్షించారు.