ధాబా,హోటల్‌పై,సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తనిఖీ
21-09-2026 | 04:00pm
చేగుంట సెప్టెంబర్ 21,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలోని రెడ్డిపల్లి శివార్(Reddypalli outskirts)లో గల అక్షిత దాబా, కర్ణాలపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద గల బి,టెక్ హోటల్‌పై జిల్లా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సిములు దాడులు నిర్వహించారు. దాబా,హోటల్లో తనిఖీలు చేపట్టి 7సబ్సిడీ గ్యాస్ సిలిండర్లనుస్వాధీనం చేసుకున్నారు.అనంతరం యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఏవరైనా అక్రమ గ్యాస్ రీఫిల్లింగకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ తాటి నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంంలో పోలీస్ సిబ్బంది బ్రహ్మం,లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.