సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మాజీ జడ్పీటీసీ
20-09-2026 | 08:46pm
మునిపల్లి సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కు(CMRF Cheques)లను ఆదివారం మునిపల్లి మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్(Former ZPTC Paithara Meenakshi Saikumar) అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.