ఆర్థిక సహాయం అందజేత
17-09-2026 | 05:43pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 17: జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింతల సైదులు కుమార్తె నల్లమేకల శోభ ఇటీవల ఆకస్మికంగా మరణించడం పట్ల జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి మధుకర్ రెడ్డి(Gudipalli Madhukar Reddy) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలో శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, తన వంతు సహాయంగా కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు.