ఘనంగా తెలంగాణ రైతాంగ, సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ
17-09-2026 | 05:48pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 17: మండల కేంద్రం అర్వపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Peasant Armed Struggle) వారోత్సవాల ముగింపు సభ గురువారం కామ్రేడ్ ఈదురు వీరపాపయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు.
అనంతరం ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం సర్కారుపై పోరాడి పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండా వీరులదన్నారు. 4500 మంది అమరులయ్యారని, 3 వేల గ్రామాలను గ్రామ రాజ్యాలుగా స్థాపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.