ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

17-09-2026 | 05:53pm

సుల్తానాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీట్స్ పంచి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా  జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు  మాట్లాడుతూ భారత దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచిన మోదీ  సేవలు ఎంతో గొప్పవి అన్నారు. 

మరిన్ని వార్తలు