గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు: సర్పంచ్ ధర్మ తేజ

17-09-2026 | 05:48pm

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ​బీర్కూర్ మండల(Birkur mandal) కేంద్రంలో త్వరలో జరగనున్న గణేష్ నిమజ్జన(Ganesh immersion) మహోత్సవాన్ని ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ ధర్మ తేజ, ఎస్ఐ రాజయ్య, తహసిల్దార్ ల ఆధ్వర్యంలో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, భక్తులకు సౌకర్యవంతంగా ముగిసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.​ నిమజ్జనం జరిగే ప్రదేశాలను, చెరువు,ఘాట్లను, ఊరేగింపు కొనసాగే ప్రధాన మార్గాలను ముందస్తుగా పరిశీలించారు.

రాత్రి వేళల్లో నిమజ్జన ప్రక్రియ సజావుగా, సురక్షితంగా సాగేందుకు ఘాట్ల వద్ద పరిసర ప్రాంతాలలో తగినన్ని విద్యుత్ ఫోకస్ లైట్లను అమర్చాలనీ పేర్కొన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం(Immersion of Ganesh idols)లో కీలక పాత్ర పోషించే బోయీ సంఘం సభ్యులతో చర్చించి, వారి సహకారంతో నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా ప్రణాళిక రూపొందించారు.నిమజ్జన స్థలాల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టి పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు