తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

21-09-2026 | 03:20pm

మంథని సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో (Apollo Reach Hospital)చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఉమ్మడి కమాన్‌పూర్ మండల మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, మాజీ రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తోట చంద్రయ్యతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. చంద్రయ్య త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోట చంద్రయ్య ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు