మంథనిలో పాదపూజ మహోత్సవం
మంథనిలో నవంబర్ 1న గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపూజ మహోత్సవం
హాజరుకానున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, అక్టోబర్ 26(విజయక్రాంతి): మంథని పట్టణంలో అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య సన్నిధిలో పాదపూజ మహోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు హాజరుకానున్నారు. ధన్వాడ, మంథని ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, కౌన్సిలర్ పెంటరి రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలీ ప్రసాద్, రాజవరం సచిన్ద్ర, దుద్దిళ్ల గణపతి, శశి భూషణ్ కాచే, శ్రీరామ్ భట్ల శ్రీనివాస్, ఆరేల్లి కిరణ్ కుమార్ గౌడ్, కోరుతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి మార్గాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు సమాజంలో శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నవంబర్ 1న ఆదివారం ఉదయం 10 గంటలకు ధన్వాడలో కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కేకే గార్డెన్స్‌లో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. హెలీ ప్యాడ్ నిర్మాణ పనులు వారు పరిశీలించారు.