రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యదర్శిగా అరెల్లి కిరణ్ గౌడ్

17-09-2026 | 06:38pm

నియామక పత్రం అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన కిరణ్ గౌడ్

మంథని, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కష్టపడి పనిచేసే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియమితులైన అరెల్లి కిరణ్ గౌడ్‌కు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అనంతరం అరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తాను సాధారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేసే అవకాశం కల్పించి, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియమించినందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కిరణ్ గౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు