పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
గుంజపడుగు సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్
మంథని,(విజయ క్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై గ్రామ ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్(Sarpanch Dandevena Sandhya Banesh) కోరారు. గురువారం మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల(ZPHS school)లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం(Swachhta Hi Seva Program)లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య బానేష్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తను వేర్వేరుగా సేకరించి, సరైన విధంగా నిర్వహించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రతి కుటుంబం బాధ్యతగా భావించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.