అక్టోబర్ 26న టీఆర్ఎస్ బహిరంగ సభ
ఇంద్రవెల్లి పేరుతో గద్దెనెక్కిన వాళ్ళు మండలాభివృద్ధిని మరిచారు
తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపూరావు
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Rakshana Sena Party) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో అక్టోబర్ 26వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు(Former MLA Rathod Bapurao) అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మెస్రం దయాకర్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయంగా ఎదుగుదల కోసం ఇంద్రవెల్లి మండల పేరును ప్రతి రాజకీయ నాయకుడు ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు.
టిఆర్ఎస్ అధినేత కల్వకుంట కవిత ఆదివాసులను గుండెల్లో పెట్టుకొని చూసుకోవడంతోపాటు ఇంద్రవెల్లి మండల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా మెస్రం దయాకర్ ను నియమించడం ఇంద్ర వల్లి మండల అభివృద్ధికి నిదర్శనం అన్నారు. అక్టోబర్ 26వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు 50 వేల మందితో నిర్వహించుటకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గం లో తెలంగాణ రక్షణ సేన ను గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు.