తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి

17-09-2026 | 07:39pm

బిజెపి మండల అధ్యక్షులు మొగిలి మహేష్

చొప్పదండి,(విజయ క్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా చొప్పదండి రూరల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆర్నకొండ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశానికి 1947 లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ తెలంగాణ ప్రజలు దాదాపు సంవత్సరం పాటు నిజం నిరంకుశ పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. దౌర్జన్యాలు, అరాచకాలు ద్వారా నిజాం రాజు తెలంగాణ ప్రజల్ని ఊచకోతకి గురి చేశాడు.

భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు విముక్తి కలిగించారు. ఈ చారిత్రాత్మక చర్యతో తెలంగాణ నైజం పాలన నుండి విముక్త్యాయి భారతదేశ యూనియన్ లో భాగమయింది & విశ్వగురు శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చొప్పదండి రూరల్ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం  రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 50 మంది రక్తదానం చేశారు

మరిన్ని వార్తలు