సాలంపాడ్ పిఎసిఎస్ చైర్‌పర్సన్‌గా వీరంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి

02-11-2026 | 04:24pm

సాలూర,(విజయక్రాంతి): రైతాంగ సమస్యల పరిష్కారానికి, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని సాలంపాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Salampad Primary Agricultural Cooperative Society)  నూతన చైర్‌పర్సన్ వీరంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సాలూర మండలం సాలంపాడ్ పిఎసిఎస్ చైర్‌పర్సన్‌గా ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ​

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాగు కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగు రుణాలను సకాలంలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉంటూ పిఎసిఎస్ సేవలను మరింత విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది, స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు