ఆదివాసి గిరిజన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం

17-09-2026 | 08:08pm

ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి గిరిజన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని ఆదివాసి గిరిజనులు ఎల్లప్పుడూ కేసిఆర్ కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్(BRS constituency in-charge Bhukya Johnson Naik) అన్నారు.

గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం ఆరు నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలుచేసి ఇప్పటికి నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆదివాసి గిరిజనులతో భారీ ర్యాలీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజనులకు మా ఊరు మా రాజ్యం అన్న నినాదంతో గిరిజనులకు స్వయం పరిపాలన హక్కుల అందించింది కేసీఆర్ అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు