రోడ్డుపై పంటలు ఆరబెట్టొద్దు

04-10-2026 | 04:29pm

కుభీర్ , అక్టోబర్ 04(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని(Kubheer Mandal) ప్రధాన, గ్రామీణ రహదారులపై(Rural roads) పంటలను ఆరబెట్టవద్దని కుభీర్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి(Kubheer SI Krishna Reddy) రైతులకు సూచించారు. రోడ్లపై పంటలు ఆరబెట్టడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రైతులు(Farmers) ఈ విషయాన్ని గమనించి రహదారులను పంటల ఆరబోతకు(Drying of crops) ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలను వినియోగించాలని సూచించారు.

రోడ్లపై పంటలను ఆరబెట్టడం వల్ల రహదారుల వెడల్పు తగ్గి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ఎస్‌ఐ పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై ఆరబెట్టిన పంటలు వాహనదారులకు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతులు తమ పంటలను రోడ్లపై కాకుండా పొలాల వద్ద, కల్లాలు లేదా ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని సూచించారు. పంటలను ఆరబెట్టే సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం పంటల కోతలు, ఆరబోత ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు పోలీసుల సూచనలను పాటించి ప్రజల భద్రతకు సహకరించాలని కుబీర్ ఎస్‌ఐ కోరారు. రహదారులు అందరికీ ఉపయోగపడే ప్రజా మార్గాలని, వాటిని పంటల ఆరబోత కోసం వినియోగించడం సరికాదని స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను సురక్షిత ప్రదేశాల్లో ఆరబెట్టి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఎస్‌ఐ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు