సీతానగర్‌లో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడి

20-09-2026 | 06:34am

107 గ్రాముల మత్తుమందు స్వాధీనం

వ్యక్తి అరెస్ట్.. కేసు నమోదు

పాపన్నపేట: పాపన్నపేట మండలంలోని సీతానగర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు(Excise Department Task Force officials) దాడి నిర్వహించి 107 గ్రాముల ఆల్ఫ్రాజోలం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. కల్లులో కలిపేందుకు ఈ మత్తుపదార్థాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈఎస్ నరసింహారెడ్డి, డీటీఎఫ్‌ సీఐ గోపాల్ ఆదేశాల మేరకు సీతానగర్ గ్రామానికి చెందిన మాదాస్ రవి వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించి ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది జీవన్, పుండరీకం, వహీద్, స్రవంతి ఉన్నారు.

మరిన్ని వార్తలు