సముద్ర మార్గంలో ఉత్కంఠ

22-10-2026 | 08:33am

21 మంది భారతీయులున్న Oil Tankerపై దాడి.. అంతా Safe!

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య సముద్ర మార్గంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల నౌక M/T Al Dasmaపై గుర్తుతెలియని Projectile దాడి జరిగింది. ఈ నౌకలో 21 మంది భారతీయ నావికులు సహా మొత్తం సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ ఘటనలో భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

Hormuz Straitలో అసలేం జరిగింది?

అక్టోబర్ 21న స్థానిక సమయం ప్రకారం, Strait of Hormuz గుండా ప్రయాణిస్తున్న సమయంలో M/T Al Dasma నౌకపై గుర్తుతెలియని వస్తువు తాకినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. నౌకలో ఉన్న సిబ్బంది భద్రతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. నౌక నిర్వహణ సంస్థతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని, భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. అయితే, వాటిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో నౌక ఒమన్‌లోని బుఖా ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 11 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్లు United Kingdom Maritime Trade Operations (UKMTO) గుర్తించింది. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని నివేదికలు పేర్కొన్నాయి. దాడికి ఉపయోగించిన వస్తువు ఏమిటి, ఘటనకు బాధ్యులెవరు అనే వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

వరుసగా Commercial Shippingపై దాడులు

గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 16న MT ST 3 అనే చమురు రవాణా నౌకపై కూడా గుర్తుతెలియని వస్తువుతో దాడి జరిగినట్లు సమాచారం. ఆ నౌకలో 15 మంది భారతీయ నావికులు ఉండగా, వారంతా క్షేమంగా ఉన్నారని అప్పట్లో కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ముఖ్యంగా Strait of Hormuz ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గం కావడంతో, ఇక్కడ జరిగే ప్రతి ఘటన అంతర్జాతీయ మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వాణిజ్య నౌకలు, సముద్రయాన సిబ్బందిపై దాడులను భారత్ గతంలో పలుమార్లు ఖండించింది. అంతర్జాతీయ జలమార్గాల్లో Freedom of Navigation, వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రస్తుతం M/T Al Dasma ఘటనపై అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు, నౌక తదుపరి ప్రయాణంపై స్పష్టత రావాల్సి ఉంది.


మరిన్ని వార్తలు