మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఈకీ వినతిపత్రం

17-09-2026 | 06:00pm

మూసాపేట్: రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని మూసాపేట్ మండల(Moosapet Mandal) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎలక్ట్రికల్ ఏఈ మూసాపేట్ కి వినతి పత్రం అందజేశారు. రైతులు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇస్తానన్న 24 గంటల కరెంటు ఇవ్వకపోగా రోజు పది గంటలు ఇస్తున్నామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటలకు కూడా కోతలు విధిస్తూ రైతులను ఇబ్బంది చేస్తుందని తెలిపారు. ఒకవైపు వర్షాలు లేక ప్రభుత్వం ఇస్తానన్న కరెంటు ఇవ్వలేకపోగా రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పుడు ఇస్తున్న 10 గంటల కరెంటు కూడా కోతలు లేకుండా ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు