తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవములో కొత్తగూడెం ఏరియా

17-09-2026 | 06:04pm

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం(kothagudem area gm office)లో  తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం(Telangana prajapalana dinotsavam)ను ఘనంగా గురువారం రోజున నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ  పాల్గొన్నారు.  సంస్థ  ఆదేశాల మేరకు 17.09.2026 న జి‌.ఎం. కార్యాలయంలో జాతీయ జెండా ఆవిస్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏరియా జి‌ఎం మాట్లాడుతూ... భారత దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం వస్తే , తెలంగాణ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17 న సంపూర్ణ భారతదేశం అవతరించినది. తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథంలో నడవడానికి అవసరమైన విద్యుత్ అందించేందుకు కావాల్సిన బొగ్గును ఉత్పత్తి,రవాణా చేయుటలో సింగరేణి ముందంజలో ఉందని, ముఖ్యంగా సింగరేణి  తెలంగాణలో భాగముగా పరిశ్రమలు అభివృద్ది చెందడానికి C&MD జ్యోతి బుద్ధ ప్రకాష్,కృషి చేయడంలో సింగరేణి  సంస్థ ముందు వరుసలో ఉంటుందని తెలియ చేసినారు.

మరిన్ని వార్తలు