బాబు సాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తే సహించం

17-09-2026 | 06:07pm

నిర్మల్ జిల్లా అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మెన రాకేష్

ఖానాపూర్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత అపర మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తే సహించేది లేదని నిర్మల్ జిల్లా అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మెన రాకేష్(Bommena Rakesh) హెచ్చరించారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ మేరకు ఇటీవల కొంతమంది బిఆర్ అంబేద్కర్ను కించపరిచే విధంగా 'కల్పిత నాయకుడు' అనే పేరుతో పుస్తకం తీసుకురావడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన కల్పిత నాయకుడు కాదని ఆయన జీవితం, రచనలు, ప్రసంగాలు, రాజ్యాంగ సభలో చేసిన కృషి, సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటం, చారిత్రక రికార్డులో ఉన్నాయని ఆయన అన్నారు.

చరిత్ర తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని వీరంతా దళిత ద్రోహులని వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. కల్పిత నాయకుడు అనే పుస్తకంలోని పూర్తి విషయాలను ప్రభుత్వం పరిశీలించాలని ,పుస్తకంలో చట్ట విరుద్ధమైన నిరాధారంగా అవమానించే అంశాలు ఉన్నట్లయితే వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. చరిత్రను వక్రీకరించే వారు ఎవరైనాప్పటికీ వారు శిక్షార్హులని అన్నారు.

మరిన్ని వార్తలు