బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే
బాధిత కుటుంబానికి అందజేసిన కాంగ్రెస్ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): వైద్య పరంగా పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎల్ఓసి ఎంతగానో దోహదపడుతుందని, కాంగ్రెస్ నాయకురాలు దాయం ఝాన్సీ రెడ్డి(Congress leader Dayam Jhansi Raji Reddy) అన్నారు. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన వడ్లకొండ వెంకన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆయన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel)ని సంప్రదించి ఆర్థిక సహాయం కోరారు.
బాధితుడి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సామెల్ సానుకూలంగా స్పందించి, ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల విలువైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.మంజూరైన ఎల్.ఓ.సి పత్రాన్ని గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులకు ఝాన్సీ రెడ్డి 6వ వార్డు సభ్యుడు గుండ్ల శేఖర్ తో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా తమకు ఆపత్కాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచినందుకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సామెల్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.