వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం
వెంకటాపురం నూగూరు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో(Sri Venkateswara Swamy Temple) ప్రతి శనివారం భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మండల కేంద్రానికి చెందిన బాసినేని ప్రవీణ్(Basineni Praveen) అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రీ పద్మావతి అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో వంటలు సిద్ధం చేసి, స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు వెల్పూరి శ్రీనివాసరావు గుప్తా, కార్యదర్శి పుల్లగుమ్మి జగన్మోహన్రావు (బాలాజీ), ఉపాధ్యక్షులు పాలడుగు రాంబాబు గుప్తా, సేవా సమితి సోదరీమణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బాసినేని ప్రవీణ్ వారి సిబ్బంది తదితరులుపాల్గొని సేవలందించారు.