కరీంనగర్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 | 06:31pm
గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
ముకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ157వ జయంతి వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించారు. కోతిరాంపూర్ చౌరస్తాలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.