నానా పటేకర్ మృతిపై ఎన్టీఆర్, పవన్ ఎమోషనల్

08-10-2026 | 12:36pm

ప్రముఖ విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) మరణవార్తతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Nana Patekar Death Newsపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ నివాళులు అర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..

నానా పటేకర్ మృతిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా చూసిన గొప్ప నటుల్లో నానా పటేకర్ ఒకరని పేర్కొంటూ ఆయనకు నివాళి అర్పించారు. నానా పోషించిన ప్రతి పాత్రలోనూ ఒక ప్రత్యేకమైన నిజాయితీ, తీవ్రత కనిపించేదని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన నటన చూస్తుంటే తాను నటిస్తున్నట్లు కాకుండా.. తెరపై నిజమైన జీవితం ఆవిష్కృతమవుతున్న భావన కలిగేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. భారతీయ సినిమాకు నానా పటేకర్ చేసిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పవన్ కల్యాణ్ సంతాపం..

Nana Patekar Deathపై ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన నానా పటేకర్ నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటనతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారని పవన్ పేర్కొన్నారు. పవర్‌ఫుల్ యాక్టింగ్, ప్రభావవంతమైన డైలాగ్ డెలివరీతో ప్రతి పాత్రలోకి తన ఆత్మను తీసుకొచ్చేవారని కొనియాడారు. కామెడీ, ఎమోషనల్, సీరియస్, సెన్సిటివ్.. ఇలా ఏ పాత్ర చేసినా ఆయన నటన ప్రత్యేకంగా ఉండేదని అన్నారు. నానా పటేకర్ నటన ఒక ప్రత్యేకమైన School of Performanceలా ఉండేదని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. నటనతో పాటు సామాజిక సేవపై ఆయనకున్న నిబద్ధతను కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. నానా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచరులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కళ, పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు.

దక్షిణాది స్టార్ల నివాళులు..

Nana Patekar Funeral, Nana Patekar Last Rites వార్తల మధ్య ఆయన మరణంపై దక్షిణాది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నటుడు, దర్శకుడు ప్రభుదేవా, ప్రకాశ్ రాజ్, ఖుష్బూ సుందర్ తదితరులు నానా పటేకర్ మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు