మహేష్ ‘వారణాసి’.. కౌంట్‌డౌన్ స్టార్ట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’(Varanasi Movie) కోసం అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో రిలీజ్‌కు ఇప్పుడు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఆఫ్రికా నేపథ్యంలో విడుదలైన స్టిల్స్‌లో మహేష్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
‘వారణాసి’లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ప్రధాన యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసే పనులు కొనసాగుతున్నాయని రాజమౌళి గతంలో వెల్లడించారు. ఏప్రిల్ 7, 2027న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. మహేష్ అభిమానుల్లో ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలైంది. రుద్రగా మహేష్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు మరో ఆరు నెలలే అని మూవీ మేకర్స్ అంటున్నారు.