దసరా సర్‌ప్రైజ్..బస్సే మీ ఇంటి ముందుకు!

07-10-2026 | 04:28pm

హైదరాబాద్, అక్టోబర్ 7: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్(Plan) చేస్తున్న విద్యార్థులు, ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు.. బస్సుల కోసం బస్టాండ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు ఉన్న ప్రాంతం నుంచే స్పెషల్ బస్సును బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ముందుగానే బస్సు Booking చేసుకోవచ్చు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే చాలు.. వారి ప్రాంతానికే ఆర్టీసీ స్పెషల్ బస్సు వచ్చి ప్రయాణికులను సొంతూళ్లకు తీసుకెళ్లనుంది. దీంతో పండుగ సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:: సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ముందస్తు బుకింగ్‌కు అవకాశం

దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బస్సులను బుక్ చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది. 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతం నుంచి ప్రయాణించాలనుకుంటే ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విధానం వల్ల ప్రయాణికులకు Convenience కలగడంతో పాటు బస్టాండ్లలో రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. ముందస్తు బుకింగ్, ఇతర వివరాల కోసం 9959226160 నంబర్‌ను సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సూచించారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు