డిస్కంలు, జెన్‌కో ప్రైవేటీకరణకు నో.. భట్టి క్లారిటీ

07-10-2026 | 02:18pm

హైదరాబాద్,అక్టోబర్ 7: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కంలు, జెన్‌కోలను ప్రైవేటుపరం(Privatization) చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని భట్టి పేర్కొన్నారు. ఎల్‌నినో(El Nino) ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

యాదాద్రి ప్లాంట్‌పై ప్రశ్నలు

యాదాద్రి పవర్ ప్లాంట్(Power Plant) వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అవసరమైన బొగ్గు(Coal) అందుబాటులో లేకుండా యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఎలా నిర్మించారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ఇంధన సరఫరాపై గత ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకుల్లో 14 మూతపడ్డాయని భట్టి తెలిపారు. బొగ్గు లభ్యత, విద్యుత్ ఉత్పత్తి, పెరిగిన డిమాండ్ వంటి అంశాలు విద్యుత్ రంగంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్షాలు విద్యుత్ సరఫరాపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఇవి కూడా చదవండి: ఉద్రిక్తత.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య వార్

ప్రైవేటీకరణకు తావులేదు

డిస్కంలు,67జెన్‌కోలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని భట్టి మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పరిరక్షిస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని Generation సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు